Pages

Friday, August 26, 2011

నిన్నం జూడరొ

నిన్నం జూడరొ మొన్నఁ జూడరో జనుల్ నిత్యంబు జావంగ నా
పన్ను ల్గన్ననిధాన మయ్యెడి ధనభ్రాంతిన్ విసర్జింపలే
కున్నా రెన్నఁడు నిన్ను గండు రిక మర్త్వుల్ గొల్వరేమో నినున్
విన్నం బోవక యన్యదైవరతులన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఈ జనులు నిన్న మొన్న నిత్యము ప్రతి ప్రాణియు ప్రతి మానవుడు మరణించుట చూచుచునే యున్నారు. దేహములు అనిత్యములని అట్టి దేహముల సౌఖ్యమునకై ధనము సంపాదించనాశపడుట వ్యర్ధమని వీరు తెలిసికొనుట లేదు. ఆపదలలో ఉన్నవాడు పెన్నిధిని చూచి తాపత్రయ పడునట్లు ధనమునందు భ్రాంతిచే ధనార్జనకు యత్నించుచున్నారే కాని ధన విరక్తి చెందకున్నారు. వీరు నిన్నెడును సేవించనే సేవించరో ఏమో అన్పించుచున్నది. నిన్ను గాక యితర దేవతలయందాసక్తులగు వారికి యిహపరములందు ఏ సుఖము పొందలేక పోవుటను చూచి నీవయిపునకు రావలయును కదా. కాని అట్లు వచ్చుటలేదు.
 

No comments:

Post a Comment