Pages

Wednesday, August 24, 2011

శ్రీ శైలేశు

శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో
కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము.
 

No comments:

Post a Comment