Pages

Monday, August 22, 2011

ఱాలన్ ఱువ్వగఁ

ఱాలన్ ఱువ్వగఁ జేతులాడవు కుమారా! రమ్ము రమ్మ్ంచునేఁ
జాలన్ జంపంగ నేత్రము న్దివియంగాశక్తుండనేఁ గాను నా
శీలం బేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నా భాగ్యమో
శ్రీలక్ష్మీపతిసేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! 


శ్రీ కాళహస్తీశ్వరా! విజ్జు అనెడి బోయవాని వలె ఱాలతో నిన్ను బూజించి నిన్ను మెప్పించలేను. సిరియాళరాజు వలె కొడుకుమాంసమును నీకు ఆహారముగ పెట్టి నిన్నాదరించలేను. విష్ణువువలె కన్ను పెఱికి నిన్ను పూజించి నిన్ను సంతోషపరచలేను. చపలచిత్తుడనగుటచే నాకు నీ విషయమున నిస్చలభక్తి లేదు. నిన్ను మెప్పించగల సామగ్రి యేది;యు లేకున్నను నిన్నే శరణు పొందినాను. నా అదృష్టము ననుసరించి నీ చిత్తమునకు దోచినవిధముగా జేయుము. 

No comments:

Post a Comment