Pages

Friday, August 26, 2011

కాసంతైన


కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో
దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో
ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!




శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.  

No comments:

Post a Comment