Pages

Wednesday, August 24, 2011

పదునాల్గేలె

పదునాల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొకఁ డాయుష్మంతుండై వీరియ
భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కటకటా! శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వ చక్రవర్తులు పూర్వ రాజులలో ఒకరు పదునాల్గు మహాయుగములకాలము భూమండలమును పాలించెను. మరియొక రాజు దీర్ఘాయుష్మంతుడై ఉదయ పర్వతమునకు అస్తపర్వతమునకు నడుమనున్న సమస్త భూమిని చక్రవర్తియై పాలించెను. ఆ పూర్వ ప్రభువులముందు నేటి ఈ రాజుల జీవితకాలమెంత, రాజ్యవిస్తారమెంత. ఈ విషయములను తెలిసియు వీరు ఏల అహంకారముతో మత్తులై యుందురో తెలియుట లేదు. 

No comments:

Post a Comment