శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం
చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!
మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం
చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే కాని ని
ర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుధ్ధితో బాగుగా ఊహ చేయుదురు. అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు - శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు. ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా!
No comments:
Post a Comment