Pages

Friday, August 26, 2011

దంతంబు

దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

3 comments:

  1. kesava garu miru chala chakkaga rasaru..

    miku kudirite telugu wiki lo ee padyalanu cherchandi..

    http://tiny.cc/e86zcw

    ReplyDelete
  2. శతక సాహిత్యము మరుగున పడుతున్న ఈసంధికాలంలో
    మీ ఈబ్లాగుద్వారా మహత్తరమైన శ్రీకాళహస్తీశ్వర శతకం తీసుకురావటం కడు అభినందనీయము. ధూర్జటి ఆర్తితో వ్రాసిన ఈపద్యాలు ఇహ పర సౌఖ్యదాయకములు. ఈశ్వరానుగ్రహరస్తు.

    ReplyDelete