Pages

Wednesday, August 24, 2011

తలమీఁదం

తలమీఁదం గుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ నాసికతుదన్ గంధప్రసారంబు లో
పల నైవేద్యముఁ జేర్చు నే మనుజ్ఁ డాభక్తుండు నీకెప్పుడుం
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఏ మానవుడు నీ యందలి అవ్యాజభక్తితో తన తలమీద నిన్ను పూజించుటచే ఏర్పడిన పుష్పప్రసాదము ధరించునో, తన నుదుటియందు విభూతిని ధరించునో, తన కంఠప్రదేశమున రుద్రాక్షదండ ధరించునో, తన ముక్కుకొనయందు గంధపూతన ధరించునో, తన కడుపులోనికి నీకు నివేదించిన పవిత్రాహారము తీసికొనునో ఆ భక్తమానవుడు నీ నివాసమగు వెండికోడమీద నీ కైలాసమున నీ చెలికానిగా అయి ఆనందముతో విహరించును. 

No comments:

Post a Comment