అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
నంతా దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే
యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా!
No comments:
Post a Comment