Pages

Sunday, September 12, 2010

నీతో యుద్ధము

నీతో యుద్ధము చేయనోప, గవితానిర్మాణ శక్తిన్నినున్
బ్రీతుం చేయగలేను, నీ కొరకు తండ్రిన్ చంపగాజాలనా
చేతన్ రోకట నిన్ను మొత్త వెఱతున్; జీకాకు నా భక్తి యే
రీతి న్నాకిక నిన్ను చూడగనగున్ శ్రీకాళహస్తీశ్వరా!  


శ్రీ కాళహస్తీశ్వరా నేను నిన్ను భక్తితో మెప్పింపజాలను. అర్జునునివలె నీతో యుధ్ధము చేయు శక్తి నాకు లేదు; పుష్పదంతుడను మహాభక్తునివలె నిన్ను మెప్పించునట్లు స్తుతిచేయుటకు సరిపోవు కవితాశక్తి నాకు లేదు; నీకొరకై తండ్రిని చంపునంతటి తీవ్రభక్తియు నాకు లేదు; రోకటితో నిన్ను మోదిన భక్తురాలియంతటి భక్తుడను కాను. అట్టి గాఢమగు భక్తిపరిపాకము లేని నేను ఏవిధముగ నిన్ను ఆరాధించి మెప్పించి నీ సాక్షాత్కారము పొందగలను. కనుక దేవా నీవే నా అసమర్ధతను గమనించి అకారణ దయతో నన్ననుగ్రహింపుము.

No comments:

Post a Comment