నిన్నేరూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!
చన్నో కుంచము మేకపెంటికయొ యీ సందేహముల్మాన్పి నా
కన్నార న్భవదీయమూర్తి సగుణా కారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ
కాళహస్తీశ్వరా! చిత్తతత్వమునకు ఆధారమగు పద్మమునందు విహరించుచు మత్తమయి
యందు తుమ్మెద యగు నీ సగుణరూపమును కన్నులార చూచి, సేవించి తరించవలెనని
కోతికగ ఉన్నది. కాని అది యెట్టిదియో నాకు తెలియదు. మునుపు కొందరు
వివిధరూపములతో నిన్ను భావించి సేవించిరని తెలియుచున్నది. మోకాలు, ఆడుదాని
స్తనము, కుంచము, మేకపెంటిక వీనిలో ఏది నీ సగుణరూపమో నాకు తెలియకున్నది. నా
ఈ సందేహమును పోగొట్టి వాస్తవమగు నీ సగుణరూమును నాకు చూపుము. కన్నులార
కాంచి నిన్ను సేవింతును.
No comments:
Post a Comment