Pages

Monday, August 22, 2011

నిను నావాఁకిలి

నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో
నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు రక్షింపఁజే
సిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను. మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొఱకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను. తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను. నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొఱపెట్టుకున్నను వినకున్నావు. ఎందుకు ప్రభూ. 

No comments:

Post a Comment