కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!
చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు అవివేకులు ఈ ప్రాపంచిక జీవనమును జీవనప్రవృత్తిననుసరించి ఆలోచింతురు. తమకు పరలోకమున ఉత్తమగతులు లభించుటకు పుత్రులు కావలయుననుకొందరు. తమకు పుత్రులు కలగనివారు అయ్యో మాకు పుత్రులు కలుగలేదు, మాకు ఎట్లు ఉత్తమగతులు కలుగును అని ఏద్చుచుందురు. కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగినను వారి మూలమున అతడు ఏ ఉత్తమలోకములు పొందగలిగెను? బ్రహ్మచారిగనే యుండి సంతతియే లేకున్న శకునకు దుర్గతి ఏమయిన కలిగెనా? కనుక పుత్రులు లేనివానికి మోక్షపదము లభించక పోదు. పుత్రులు కలవారికి ఉత్తమగతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేనివరికిని అవి రెండును సిద్దించను వచ్చును.
No comments:
Post a Comment