Pages

Wednesday, August 24, 2011

గ్రహదోషంబులు

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీకళ్యాణనామంబు ప్ర
త్యహముం బేర్కొనుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే?
దహనుం గప్పంగంజాలునే శలభసంతానంబు నీ సేవఁ జే
సి హతక్లేసులు గారుగాక మనుజుల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! జనులు సాధారణముగ నిన్ను సేవింపక అనేక క్లేశములు పడుతున్నారు. అనుదినము శుభకరమగు నీ నామమును స్మరించు ఉత్తమోత్తములను గ్రహదోషములు కాని దుర్నిమిత్తములు కాని బాధించవు. మిడుతల గుంపు ఎంతఁగ్రమ్మిన అగ్నిని ప్రకాశించకుండ కప్పివేయజాలవు కదా! 

No comments:

Post a Comment