Pages

Wednesday, August 24, 2011

చావం గాలము

చావం గాలము చేరువౌ టెఱిఁగియుం జాలింపఁగా లేక న
న్నెవైద్యుండు చికిత్సఁ బ్రోవఁగలఁడో యేమందు రక్షించునో
ఏ వేల్పుల్ కృపఁజూతురో యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా
జీవచ్ఛ్రాధ్ధముఁ జేసికొన్న యతియున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కొందరు ఐహికజీవితముపై విరక్తి కలిగినట్లు జీవచ్చ్రాద్ధము జరుపుకొనెదరు. సంన్యాసమును కూడ స్వీకరింతురు. కాని వారికి దేహ భ్రాంతి వదలదు. దేహముపై మమకారము పోదు. మరికొంత కాలము సుఖముగ, ఆరోగ్యముగ బ్రతుకవలయునను కోరికతో తనను ఏ వైద్యుడైనను చికిత్స చేసి తన దేహ భాధలు పోగొట్టగలడో, ఏ మందు తనను కాపాడునో, ఏ దేవుడో దేవతో రక్షించునని మ్రొక్కుచు ఆ ప్రయత్నములలో మునిగియుందురే కాని నిన్ను కొంచెమైన ధ్యానించరు. నాకు యిట్టి స్ఠితి వలదు. నిన్నే ఆశ్రయించుచున్నాను. నీకడ ఆశ్రయమిచ్చి నన్ను నీ సేవకునిగ చేసికొనుము. 

No comments:

Post a Comment