Pages

Wednesday, August 24, 2011

ఎన్నేళ్ళుందు

ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం?
జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము.
 

No comments:

Post a Comment