రాజర్ధాతుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!
నాజాతిక్రియ లేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతినీ భక్తుల్ భవత్పాదనీ
రేజంబుల్ భజియింతు రేతెఱఁగునన్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! రాజు ధనమునందు పేరాస కలవాడైనచో ఏదో ఒక విధముగ ప్రజలను పీడించి వారి ధనమును రాబట్టుకొనును. అపుడు ధర్మమెట్లు నిలుచును. వర్ణాశ్రమధర్మవ్యవస్థలు ఎట్లు ప్రవర్తుల్లును? చివరకు వేశ్యలకు కూడ జీవనము సాగక పోవచ్చును. వారి కళలకు ఆదరణ లభించదు. ధనము లభించినను రాజు దక్కనీయడు. నీ భక్తులు ఎవ్వరును నిబ్బరముతో మనస్సు నిలుకడతో నీ పాదపద్మములను సేవించజాలరు. కనుక లోకవ్యవస్థ సరిగ్గా ఉండి భక్తులు నిన్ను సేవించుటకు వీలుగా రాజులందు ఈ అర్ధకాంక్షాధిక్యము లేకుండునట్లు చేయమని ప్రార్ధించుచున్నాను.
No comments:
Post a Comment