Pages

Friday, August 26, 2011

జాతుల్ సెప్పుట

జాతుల్ సెప్పుట సేవసేయుట మృషల్ సంధించు టన్యాయవి
ఖ్యాతిం బొందుట కొండెకాఁడవుట హింసారంభకుండౌట మి
ధ్యాతాత్పర్యములాడుటన్నియుఁ బరద్రవ్యంబునాశించి యీ
శ్రీ తా నెన్నియుగంబు లుండఁగలదో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! భవిష్యత్ చెప్పుట, యితరుల సేవ చేయుటయు, అసత్యములను పలుకుటయు అన్యాయములు ఆచరించుచు ఆ విషయమున పేరు పొందుటయు, కొండెములు చెప్పువాడు, ప్రాణిహింస చేయువాడగుట, అసత్యములను ఇతరులకు ప్రవచించుట ఎందులకు? పరుల ద్రవ్యము తాను సంపాదించవలెనన్న ఆశతోనే కదా. ఇట్లు అధర్మముతో సంపాదించినది ఎన్నినాళ్లుండును? కనుక మానవుడు యిట్టి ప్రాపంచిక ధనమును ఆశించి అధర్మ వర్తనమున వర్తించుటకంటె నిశ్చల నిర్మల భక్తితో నిన్ను ఆరాధించుటచే శాశ్వర మోక్షపదము లభించును. 

No comments:

Post a Comment