Pages

Friday, August 26, 2011

తాతల్ తల్లియుఁ

తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియుఁ బెద్దల్ చావగాఁ జూడరో
భీతిం బొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాముబిడ్డల్ హిత
వ్రాతంబున్ బలవింప జంతువులకున్ వాలాయమైయుండంగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! తమ తాతలు తల్లియు తండ్రియు మరియు ఇట్టివారెందరో పెద్దలు చావగా జనులు చూచియుండరా. చావు అనునది ప్రతిప్రాణికి తప్పక జరుగునని యిది స్వాభావికమని తెలియదా. అట్టి చావునుండి భయపడుట ఏల! మానవుడు యిట్టి మృత్యువునకు భయపడుచు దుఃఖముతో కాలమును గడుపుచుండునే కాని మృత్యువును జయించి అమృతతత్వరూపమగు ముక్తి పొందుటకు సాధనమైన నీ సేవ చేయకున్నాడే. ఇది ఎంత ఆశ్చర్యకరమగు విషయము
 

No comments:

Post a Comment