Pages

Friday, August 26, 2011

అయవారై

అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్
దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదుల
న్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి నిన్నాత్మని
ష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును. తమ పాదోదకము వారితో త్రాగించి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును. ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు.
 

No comments:

Post a Comment