Pages

Friday, August 26, 2011

మాయా

మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ)
జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో
శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా. వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా. ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు. 

No comments:

Post a Comment