Pages

Wednesday, August 24, 2011

అమరస్త్రీల

అమరస్త్రీల రమించినం జెడదు మోహం బింతయున్ బ్రహ్మప
ట్టము సిధ్ధించిన నాస దీఱదు నిరూఢక్రోధమున్ సర్వలో
కముల న్మ్రింగిన మాన దిందుఁ గడతున్ శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తీశ్వరా! స్వర్గలోకము లభించి అప్సరస్త్రీలతో కామసుఖములనుభవించినను మోహము తీరదు. బ్రహ్మలోకపాలనాధికార పట్టాభిషేకము గావించినను ధనము మొదలైన వానిపై ఆశ తీరదు. సర్వలోకములను మ్రింగినను క్రోధము తీరదు. ఇట్లు దేనిచేతనైనను కామము, లోభము క్రోధమను అంతఃశత్రువులు తృప్తినందవు, శాంతించవు. కనుక ప్రభూ ఇట్టివానివలన కలుగు సౌఖ్యములు పొందవలయునను కోరిక నాకు లేదు. నిన్ను సేవించి మహాపాతకములను ఈ సంసారసాగరము దాటవలెనని నాత్రమే కోరుతున్నాను.
 

1 comment: