Pages

Wednesday, August 24, 2011

చనువారిం గని

చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే
మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్
మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁ
జెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.. యమునుద్దేశించి యమా! మేము వీరి ఏడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు. కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు. తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించినలేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా. 

No comments:

Post a Comment