Pages

Friday, August 26, 2011

తమకొం బొప్పఁ

తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగిమంచి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నేను నిన్ను వేడెదేమనగా ’మనస్సు అత్యంత ఆశక్తితో పరస్త్రీలతో సంగమించి సుఖించగోరుచున్నది. పరద్రవ్యములను దొంగిలించవలె ననుకొనుచున్నది. అందుకు అధిక ప్రయత్నములు చేయుచున్నది. నా మనస్సు దొంగయి నాకు తెలియకుండనే ఇట్టి దుష్ప్రయత్నములు చేయుచున్నది. కనుక నీవు ఈ దొంగను పట్టుకొని వైరాగ్యమను పాశములతో బంధించుము. పిమ్మట ఎచ్చటికి పోనీయక నీ పాదములను స్తంభమునకు కట్టివేయుము. ఆ విధముగ నాకు సంతోషమును ఆనందమును కలిగించుము. 

No comments:

Post a Comment