Pages

Friday, August 26, 2011

వేధం దిట్టగరాదుగాని

వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులంజేయ నే
లా ధీచాతురిఁ జేసెఁ జేసిన గులామాపాటనే పోక క్షు
ద్బాధాదుల్ గలిగింపనేల యది కృత్యంబైన దుర్మార్గులం
జీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీ యంశముతోనే నీవు రజోగుణప్రధానమయిన సృష్టికర్తయగు బ్రహ్మను చేసితివి. అట్టి బ్రహ్మను తిట్టినచో నిన్ను తిట్టినట్లేయగును. ఐనను అతను చేసిన తప్పులను నీకు చెప్పుచున్నాను. భూలోకములో కొందరిని పండితులుగ, కొందరిని కవులుగ పుట్టించుట ఎందులకు? వారికి బుద్ధిచాతుర్యము కలిగించుట ఎందులకు? అట్టి వారికి ఆకలిబాధ మొదలైనవి కల్పించినాడు. అది నీవు అతనికి నియమించిన కృత్యమో ఏమో. అయినచో అతను రాజులను సద్గుణవంతులుగ పండితులను కవులను వారి యోగ్యత గుర్తించి ఆదరించు ఉత్తములుగా చేయక వారిని అనాదరము చేయు దుర్మార్గులుగ చేసినాడు. ఇది తగునా. 

No comments:

Post a Comment