Pages

Friday, August 26, 2011

మొదలన్భక్తులకిచ్చి

మొదలన్భక్తులకిచ్చినాఁడవుగదా మోక్షంబు నేఁ డేమయా
’ముదియంగా ముదియంగఁ బుట్టు ఘనమౌ మోహంబు లోభంబు’ న
న్నది సత్యంబు కృపం దలంప నొకవుణ్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్ మొఱవెట్టఁగాఁ గటగటా! శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! పూరవము మార్కండేయుడు మొదలగు భక్తులకు ఎందరకో వారు ఒక్కమారు వేడినంతనే వారికి ఐహికఫలములను, దీర్ఘాయువు, జీవన్ముక్తి, విదేహకైవల్యము మొదలగునవి కూడ ఇచ్చియుంటివి. ఇపుడు నావంటి దీన భక్తుడు ఎంత వేడుకున్ననూ అనుగ్రహింపకున్నావు. ఇది ఏమి కాఠిన్యమయ్యా. మునుపు నీలో ఉన్న పరమదయళుతాస్వభవము ఇపుడు ఎచటికి పోయినది. ’ముదియగా ముదియగా ప్రాణికి లోభమును మోహమును పుట్టుకొని వచ్చును’ అన్న సామెతగ నీకు వయస్సు గడచిన కొలది నీవు నీకు ఉన్నది ఎవరికిని ఈయక దాచుకొని మూటకట్టుకొనవలయు నను ధనమోహము, ధనలోభము పుట్టినట్లున్నది. 

No comments:

Post a Comment