Pages

Friday, August 26, 2011

కాలద్వారకవాటబంధనము

కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా
లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది
క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము. 

No comments:

Post a Comment