Pages

Wednesday, August 24, 2011

రోసీ రోయదు

రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
పాసీ పాయరు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నా మనస్సు విచిత్ర స్థితితో రీతిలో తన ఇఛ్ఛవచ్చినట్లు ప్రవర్తిల్లుచున్నది. సుందరులైన స్త్రీల యౌవన కామ సుఖానుభవమను దృష్టితో కొన్ని సమయములందు, విరక్తితో కొన్ని సమయములు సంచరించుచున్నది కాని పూర్ణవైరాగ్యము పొందుట లేదు. పుత్ర మిత్ర జనములు, సంపదల యందు ప్రీతిని కొద్దిగా వదలుచున్నది కాని పూర్తిగ వదలుట లేదు. కోరికలనెడి తీగలను కొంత కోసివేయుచున్నది కాని సంపూర్ణముగ కోసివేయుట లేదు. నీకు ప్రీతికరములగు సత్కర్మలనాచరించ సంకల్పించుచున్నది కాని పూర్ణముగ జరుగుట లేదు. కనుక దేవా నా ప్రార్ధన మన్నించి ఈ నా మనస్సునందలి ఈ విచ్చలవిడితనమును పోగొట్టి పైని చెప్పినట్లు ఉన్న నా మనోదోషములను నశింపజేయుమా.
 

No comments:

Post a Comment