Pages

Friday, August 26, 2011

సలిలమ్ముల్

సలిలమ్ముల్ జుఖుకప్రమాణ మొక పుష్మమ్మున్ భవన్మౌళి ని
శ్చలబక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్ సేయఁగా ధన్యుఁడౌ
నిల గంగాజలచంద్రఖండముల దానిందుం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీ మహత్త్వ మిదిగా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! ఎవరు నీయందు నిశ్చలభక్తితో చుళుకప్రమాణము (అరచేతి గుంటెడు) జలముతో నీ శిరస్సును అభిషేకించి, నీ శిరస్సున ఒక పుష్పముతో అలంకరించి పూజించునో అతడు అట్టి పూజతో ధన్యుడగుచున్నాడు. వాడు ఈ లోకమునందు తన దేహావసానమున పరలోకమునందును గంగాజలమును చంద్రఖండమును పొందును. అట్లు వానికి ఇంద్ను అందును నీ చక్కదనము లభించును. నీ మహాత్మ్యము ఇటువంటిది. 

No comments:

Post a Comment