Pages

Friday, August 26, 2011

క్షితిలో

క్షితిలో దొడ్డతురంగసామజము లేచిత్రమ్ము లాందోళికా
తతు లే లెక్క విలాసినీజనసువస్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమిదుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహపాదపద్మయుగళా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీ పాదపద్మములను అర్చించినచో ఆ భక్తులకు ఈ లోకమున శ్రేష్ఠములగు అశ్వములను, గజములను లభించుట ఏమి ఆశ్చర్యకరము! పాలకీలు మేనాలు మొదలగు వాహన సమూహములు లభించుట ఏమి లెక్క! సుందరులగు స్త్రీలును విలాసినులగు దాసీజనములు దాసులు ఉత్తములగు వస్త్రసమూహములు భూషణముల సమూహములు సుగుణవంతులగు పుత్రులును ఏ మొదలగు ప్రాపంచిక సంపత్సమృద్ధి సిద్ధించుట ఎంతమాత్రము దుర్లభము కాదు. 

No comments:

Post a Comment