రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరంగా సౌఖ్యమో
యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!
యీ జన్మంబు తరింపఁజేయగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరౌ మానవు ల్పాపరా
జీజాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల్ పాప చిత్తవృత్తులతో పాపములనాచరించుచు మదముచేత తమ బుద్ధులు గ్రుడ్డివి కాగా తమ పాండిత్యమో లేక యితర విజ్ఞానమో కారణముగ రాజులను సేవించి, దాసులగుచు పొందిన సంపదలు సుఖము కలిగించునా! లేక ఈ జన్మ దాటించి మరల జన్మించనవసరము లేని మోక్షమునిచ్చు నీ నిరంతర సేవ అధిక సుఖమిచ్చునా! ఇది తెలిసికొనజాలక ఉన్నారు.
No comments:
Post a Comment