సంపద్గర్వముఁ బాఱఁద్రోలి రిపులన్ జంకించి యాకాంక్షలన్
దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం
జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!
దంపుల్వెట్టి కళంకము ల్నఱకి బంధక్లేశదోషంబులం
జింపుల్సేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం
జెంపల్వేయక నిన్నుఁ గాననగునా శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నిన్ను సాక్షాత్కారము చేసికొనవలెననిన ఈ ముఖ్యసాధనములు కావలయును. మానవుడు తనకు సంపదలున్నను వానివలన గర్వము నందరాదు. కలిగిన గర్వమును పారద్రోలవలయును. కామము, క్రోధము, లోభము మోహము మదము మత్సరము మొదలైన అంతఃశత్రువులు తన జోలికి రాకుండునట్లు వానిని భయపెట్టవలెను. ప్రాపంచిక సుఖముల వలన కలుగు ఆకాంక్షలనే తంపులు పెట్టి వానిని దగ్ధము చేయవలహును. చిత్తక్లేశముల మూలములగు అంతఃకరణవృత్తిదోషములన్నింటిని ముక్కలు చేయవలెను. వయోవిలాసములచే కలుగు వికారములు సంక్షేపించి నశింపజేయవలెను. పంచతన్మాత్ర విషయములను తమ తమ జ్ఞానేంద్రియములతో అనుభవింప వలెనను వాంఛలకి చెంపలు వేయవలెను. వానియందు విరక్తి నందవలయును. ఇటువంటి సాధనసంపత్తితో కూడిన చిత్తముతో నిన్ను ఆరాధించినవారు మాత్రమే నీ తత్వమును ఎరిగి నిన్ను దర్శించగలుగును.
No comments:
Post a Comment