Pages

Wednesday, August 24, 2011

ఆలంచు న్మెడఁ

ఆలంచు న్మెడఁ గట్టి దానికి నవత్యశ్రేణిఁ గల్పించి త
ద్భాలవ్రాతము నిచ్చిపుచ్చుటను సంబంధంబు గావించి యా
మాలర్మంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగాఁ
సీలన్సీల యమర్చిన ట్లొసఁగితో శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! సంసార బంధములలోని అంశముగ మానవులలో పురుషునకు భార్య, భార్యకు భర్త అను బంధములను గట్టుచున్నావు. దానికితోడు సంతానమను బంధపరంపరను కల్పించుచున్నావు. ఈ సంతతితో కోడండ్రు అల్లుళ్లు అను బాంధవ్య బంధములను కల్పించి మాలిమి ఆసక్తి మమకారము ఉద్భవింపచేస్తున్నావు. ఇది ఎట్లున్నదనగా ఒక వస్తువును మరియొక వస్తువుతో కలిపి విడిపోకుండ ఒక సీలను కొట్టి ఆపై మరికొన్ని సీలలు కొట్టినట్టున్నది. నన్ను అట్టి బంధములలో ఇరికించవలదు. ఇప్పటివరకు నేను చిక్కుకున్న బంధములనుండి నన్ను విడిపించుము. 

No comments:

Post a Comment