దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదేశామ్రకా
ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!
ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా
నననిష్థ న్నునుఁ జూడఁ గన్ననదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా
సినిమాయానటనల్ సుఖంబు లగునే శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! అనుదినము నీ ఆలయ సమీపమున ప్రవహించు సువర్ణముఖీ నదీతీరమున ఉన్న మామిడితోట నడుమనున్న అరుగు పై పద్మాసనమున కూర్చుండి నిష్థాపూర్వకముగ ధ్యానమున నిన్ను దర్శ్ంచుచు చిత్తమునందు ఆనందమును అనుభవించ కలిగినచో అదియే వాస్తవమగు ఆనందము. అదియే సత్యమగు సుఖము. అంతేకాని లక్ష్మీవిలసనములచే ధనసాధ్యములగు భ్రాంతి కల్పితములగు భోగములతో కలుగు ఆనందము ఆనందమా?
No comments:
Post a Comment