Pages

Wednesday, August 24, 2011

పవమానాశనభూషణప్రకరమున్

పవమానాశనభూషణప్రకరమున్ భద్రేభచర్మంబు నా
టవికత్వంబుఁ ప్రియంబులై భుగహశుండాలాతవీచారులన్
భవదుఃఖంబులఁ బాపు టొప్పుఁ జెలఁదింబాటించి కైవల్యమి
చ్చి వినోదించుట కేమి కారణమయా శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! నీవు గాలిని ఆహారముగా గ్రహించి జీవించు సర్పములను ఆభరణసమూహములును మదపుటేనుగుతోలును ఆటవికుని రూపమును నీకు ఇష్థములగుచు తిరుగుచున్నావు. సర్పమును, ఏనుగును కన్నప్పను కరుణించి సంసార దుఃఖము పోగొట్టి మోక్షమునిచ్చితివి. అంతకంటె క్షుద్రప్రాణియగు సాలెపురుగును కూడ చాల ఆదరించి కైవల్యమునిచ్చి వినోదించుచున్నావు. ఇందులకేమి కారణమో చెప్పగలవా? అట్టి క్షుద్రప్రాణులననుగ్రహించిన నీవు ఏకాంత భక్తితో ఆరాధించు నన్ను ఏల అనుగ్రహించక యున్నావయ్యా!
 

No comments:

Post a Comment