మును నీచే నపవర్గరాజ్యపదవీ మూర్ధాభిషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా
రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె
ట్లనినం గీటఫణీంద్రపోతమదవే దండోగ్రహింసావిచా
రిని గాంగాఁ నిను గానఁగాక మదిలో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! ఇంతకుముందు నీచేత అపవర్గమను (ముక్తి) రాజ్యపదమునందు మూర్ధాభిషేకము నందుకొనిన మహనీయులు కొందరుండిరి కదా. ఆలోచించి చూడగ వారు నేను ఒక్క సాటివారమే. కాని నేను ఆ మహనీయుల స్థితిని పొందలేకపోతిని. నేను నా అజ్ఞానముతో పురుగుగానో పాము గానో మదపుటేనుగుగానో హింసాజీవుడగు బోయగానో ఐనను చాలునన్న లక్ష్యముతో నిన్ను నాపూర్వజన్మములయందు ధ్యానించి యుండలేదు కాబోలు. అందుకే అట్టి జన్మము రాక అపవర్గ మదవీమూర్ధాభిషేకము పొందజాలకపోతిని.
No comments:
Post a Comment