Pages

Friday, August 26, 2011

పదివేలలైనను

పదివేలలైనను లోకకంటకులచేఁ బ్రాప్రించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యము గాదు సర్వమునకున్ మధ్యస్థుఁడై సత్యదా
నదయాదుల్ గల రాజు నాకొసఁగు మేనవ్వాని నీ యట్లచూ
చి దినంబున్ ముదమొందుదున్ గడపటన్ శ్రీ కాళహస్తీశ్వరా!


శ్రీ కాళహస్తీశ్వరా! లోకకంటకులగు దుష్టప్రభువుల వలన లభించు సౌఖ్యము పదివేల విధములుగా ఉండినను లేదా పదివేల బంగరు నాణేముల వెల చేయునదియె యైనను నాకు అది పథ్యము కాదు. ప్రతియొక ప్రాణి విషయమున నిస్పక్షపాత భావమును వహించి సత్యము దానము దయ మొదలగు సద్గుణములు గల రాజెవరైన ఉన్నచో అట్టివానిని నాకు చూపుము. అతనిని నిన్ను సేవించినట్లే సేవించుచు అతనివలన లభించునది ఎంతల్పమైనను అనుదినము ఆనందము ననుభవించుచు హాయిగా ఉందును.
 

No comments:

Post a Comment